ఇద్దరు టీవీకే మంత్రులకు.. పరువునష్టం నోటీసులు పంపిన స్టాలిన్ అల్లుడు
తమిళనాడు మాజీ సీఎం, ప్రతిపక్ష డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడు ఇద్దరు టీవీకే మంత్రులకు పరువునష్టం నోటీసులు పంపారు. ఆ మంత్రులు తనపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. (Stalin’s Son-In-Law) 15 రోజుల్లోగా వారు క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి చెందిన మంత్రి ఆదవ్ అర్జున ఇటీవల మీడియా సమావేశంలో స్టాలిన్ కుటుంబంపై పలు ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో 36 శాఖలకు చెందిన డీఎంకే మంత్రులంతా అవినీతి ద్వారా డబ్బు వసూలు చేశారని ఆయన విమర్శించారు. చెరో 16 శాఖలకు చెందిన డబ్బును స్టాలిన్ కుమారుడు...