సంతాన లోపం సమస్యకు మహిళలనే నిందించొద్దు..
సంతానోత్పత్తి సమస్యలు అంటే చాలామంది ముందుగా మహిళల ఆరోగ్యాన్నే అనుమానిస్తారు. అయితే గర్భధారణ అంశం భార్యాభర్తలు ఇద్దరి ఆరోగ్యంపై ఆధారపడే ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, నిద్ర, శారీరక ఆరోగ్యం వంటి అంశాలు పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పురుషులలో జింక్ లోపం కూడా సంతానోత్పత్తికి అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సంతానలేమి సమస్యల్లో దాదాపు సగం కేసులకు పురుషుల ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతాయని చెబుతున్నారు. కాబట్టి గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మహిళల ఆరోగ్యంపైనే దృష్టి పెట్టడం సరిపోదు. పురుషుల శుక్రకణాల నాణ్యత, సంఖ్య, కదలిక కూడా సమానంగా కీలక...