కేప్ వెర్డే కెప్టెన్‌పై రేప్ ఆరోపణలు.
ప్రస్తుత ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup)లో.. ఆఫ్రికా ద్వీప దేశం కేప్ వెర్డే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన ఆ దేశం.. ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ నాకౌట్ దశకు చేరుకున్నది. అయితే ఆ జట్టు కెప్టెన్ ర్యాన్ మెండిస్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ బ్రెజిల్ మహిళపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు కేసు బుక్కైంది. ఆ కేసును న్యూజిలాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఫిఫా వరల్డ్‌కప్ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో.. ఆక్లాండ్‌లో కేప్ వెర్డే ఓ మ్యాచ్ ఆడింది. ఆ సమయంలో బ్రెజిల్ మహిళతో పరిచయం అయ్యింది. వాస్తవానికి ఆమెను కేప్ వెర్డే జట్టుకు ఇంటర్‌ప్రిటర్‌గా కివీస్...