విద్యార్థులకు ఊరట.. ఫీజుల వసూళ్లపై హైకోర్టు స్టే కొనసాగింపు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వచ్చే జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. గత విచారణలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని పేర్కొంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-9లోని నాలుగు నిబంధనల అమలుపై తాత్కాలికంగా స్టే విధించింది. హైకోర్టు జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులు జులై 6వ తేదీ జరిగే తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని...