హనీట్రాప్ కలకలం
జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న 'కిలాడి లేడి' ఉషారాణి హనీట్రాప్ ముఠా భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. పెళ్లి పేరుతో అమాయకులను, ప్రముఖులను ట్రాప్ చేసి, ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొడుతున్నారు. ఈ ముఠా వలలో చిక్కి తాను సర్వస్వం కోల్పోయానని వడమాలపేట మండలం పాదిరేడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చుక్క చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. ఉషారాణి తనను టార్గెట్ చేసి, నిలువునా ముంచేసిందని కన్నీటిపర్యంతం అయ్యారు. బాధితుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ఉషారాణి మొదట పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత పథకం ప్రకారం హనీట్రాప్ ముఠా రంగంలోకి దిగారు. నన్ను బెదిరిస్తూ అకౌంట్ల ద్వారా ఏకంగా...