కారులోని వ్యక్తికి గుండెపోటు..

ఛాతిలో నొప్పి రావడంతో ఒక వ్యక్తి కారు డ్రైవ్‌ చేస్తూ ఆసుపత్రికి బయలుదేరాడు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అతడికి గుండెపోటు రావడంతో కారులో కుప్పకూలాడు. గమనించిన ఇద్దరు నర్సులు బస్సు దిగి ఆ వ్యక్తికి సీపీఆర్‌ చేసి ఆసుపత్రికి తరలించి అతడి ప్రాణాలు కాపాడారు. (Nurses Save Man) కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఓక్కల్ సమీపంలోని తన్నిపుళలో లాటరీ టికెట్ల షాపు నిర్వహిస్తున్న 43 ఏళ్ల సినోజ్‌కు బుధవారం ఉదయం ఛాతిలో తీవ్రంగా నొప్పి వచ్చింది. దీంతో స్వయంగా కారు నడుపుకుంటూ ఆసుపత్రికి బయలుదేరాడు. ఎంసీ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సినోజ్‌కు గుండెపోటు రావడంతో తన కారులో కుప్పకూలిపోయాడు. గమనించిన...