గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట :

గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మేము గురుకులాల టెండర్లలోనేరూ. 2,000 కోట్ల టెండర్లలో స్కాం జరిగిందంటే.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ముందు ఈ టెండర్‌ రూ.687 కోట్లు అన్నరు.. ఆ తర్వాత కాదు రూ.1,142 కోట్లు అన్నారు. మేమన్నం రూ.2000 కోట్ల టెండర్లు జరుగుతున్నయి.. దీంట్లో అవకతవకలు జరుగుతున్నయి. స్కాం జరిగింది అని చెప్పినమన్నారు. గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్లకు పిలిచారు. పత్రికల్లో రూ.200 కోట్ల గోల్‌మాల్ జరిగిందని వచ్చింది. అన్నీ కలిపితే...