‘ప్రజారోగ్యాన్ని గాలికొదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం’

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానాలు నిరుపేద రోగుల ఆరోగ్యానికి భరోసా ఇస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వ‌జమెత్తారు. గురువారం కోదాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయ‌న ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులు పడుతున్న ఇబ్బందులను, అరకొర వసతులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు సకాలంలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వసతులను కల్పించిన‌ట్లు తెలిపారు. అయితే రెండున్నర సంవత్సరాల కాలంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్...