పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?

ఇరాన్-అమెరికా యుద్ధం ముగియడం, పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయేమోనని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం, చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం లేదన్నారు. అయితే, కొన్ని వారాలపాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు స్థిరంగా, తక్కువగా ఉంటే అప్పుడు ప్రభుత్వం ధరల్ని తగ్గిస్తుందని చెప్పారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి జూన్ 30 వరకు చమురు కంపెనీలు రూ.74,781 నష్టపోయాయన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకాల ద్వారా ఈ మేరకు కంపెనీలు నష్టపోయాయన్నారు. ప్రస్తుతం...