వైభవ్ సూర్యవంశీకి ఇంత హైప్ ఇవ్వకండి
భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. 15 ఏళ్లకే సీనియర్ జట్టులో అవకాశం దక్కించుకుని చరిత్ర సృష్టించిన వైభవ్‌కు.. ఇంకా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్.. సీనియర్ ప్లేయర్ల పేలవ ప్రదర్శన నేపథ్యంలో అతడికి ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం చర్చంతా వైభవ్ అరంగేట్రం గురించే! ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ప్లేయర్ అయినప్పటికీ.. అతడికి ఇంత హైప్ ఇవ్వొద్దని సూచించాడు. ‘వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడు అనడంలో...