కేతన్ హత్య కేసు.. సియా గోయాల్, చేతన్ చౌదరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
మహారాష్ట్రలోని పూనేకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరికి పూనే కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు శుక్రవారం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఏఎం విభూతే ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ పోలీసులు కోర్టును కోరారు. ఇంకా విచారణ జరపాల్సి ఉందని, నిందితులు తమ ఫోన్లలో కోడ్ లాంగ్వేజ్ వాడారని కోర్టుకు చెప్పారు. అందువల్ల తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. కానీ, ఈ వినతిని నిందితుల తరఫు...