ప్రశ్నించే గొంతులను నిర్బంధిస్తున్న ప్రభుత్వం: డా. దాస్యం అభినవ్ భాస్కర్ ఆరోపణ
వరంగల్, జూలై 4 (సుదీక్ష న్యూస్): భద్రకాళి అమ్మవారి ఆలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆలయ శుద్ధి కార్యక్రమానికి వెళ్లకుండా GWMC 60వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్‌ను శనివారం ఉదయం పోలీసులు ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డా. దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకాకుండా నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నిర్బంధిస్తోందని ఆయన ఆరోపించారు.భద్రకాళి ఆలయంలో నిర్వహించనున్న కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే...