మీకు దమ్ముంటే బీజేపీలో చేరి మాట్లాడండి..
తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. బీజేపీ తమ పార్టీలో చీలికలపై దృష్టి పెట్టిందన్నారు. టీఎంసీ (TMC) లో చోటుచేసుకుంటున్న మార్పులకు కాషాయ పార్టీనే కారణమని, అసమ్మతి నేతలను రెచ్చగొడుతోందని అన్నారు. తమ పార్టీలో నిజాయతీ లేని కొందరు నేతలు బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. ధైర్యముంటే నేరుగా బీజేపీలో చేరి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య రాజీనామా.. తదనంతర పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అంతకుముందు మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా పేరున్న చంద్రిమా...