బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పరశురామ్ ..
‘గీత గోవిందం’తో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకుండా కథలపై పనిచేస్తున్న ఆయన, ఈసారి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కోసం ఓ భారీ పాన్ ఇండియా కథను సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 2008లో వచ్చిన ‘యువత’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరశురామ్, ఆ తర్వాత ‘ఆంజనేయులు’, ‘సోలో’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన కెరీర్‌కు అసలైన బ్రేక్ మాత్రం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన గీత...