జాబ్ లేక ఇంట్లోనే భర్త.. భార్యను దోశల పెనంతో కొట్టి హత్య
ఢిల్లీలో శనివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను దోశల పెనంతో కొట్టి చంపేశాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, దినేశ్ పటేల్ అనే వ్యక్తి గత రెండు మూడేళ్లుగా షిజోఫ్రేనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఐటీ రంగానికి చెందిన అతడికి రెండు నెలల క్రితం ఉద్యోగం కూడా పోయింది. ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక పరిస్థితితో పాటు అతడి మానసిక ఆరోగ్యం కూడా దిగజారసాగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది....