పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా

వరంగల్/హైదరాబాద్ (సుదీక్ష న్యూస్ ): ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న పేదల గుడిసెలను కూల్చివేయకుండా, వారు నివసిస్తున్న స్థలాలకే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో వరంగల్ జిల్లా నుంచి వేలాది మంది గుడిసెవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడిసెవాసుల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...