గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు..
విశాఖపట్నం: చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం (కోస్ట్ గార్డ్), భారత నౌకాదళం (నేవీ) సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిరంతరంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్‌కు చెందిన ఐసీజీఎస్ కనక్ లతా బరువా (ICGS Kanak Lata Barua), ఐసీజీఎస్ వీర (ICGS Veera) నౌకలను గాలింపు చర్యలకు పంపినట్లు తెలిపారు. అలాగే కోస్ట్ గార్డ్‌కు చెందిన మూడు హెలికాప్టర్లు సముద్రంలో విస్తృతంగా గాలింపు...