ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!

538 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 17,266 పరుగులు.. 829 స్టంపింగ్స్.. కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలు.. రాంచీ వీధుల నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించే వరకు ఎదిగిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు నేడు. టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశానికి ట్రోఫీలు అందించే వరకు.. మాహీ ప్రస్థానం అద్వితీయం! 45వ పడిలోకి అడుగుపెడుతున్న ధోనికి బీసీసీఐ స్పెషల్ విషెస్ చెప్పింది. క్రికెట్ ఐకాన్ అంటూ అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. వేగానికి పెట్టింది పేరు.. ఎంఎస్ ధోని వికెట్ల వెనుక ఉన్నాడంటే ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకే. కళ్లు మూసి తెరిచేంతలో స్టంపింగ్ చేయడంలో ధోని దిట్ట. క్రికెట్‌లో సాధారణంగా కెప్టెన్లు...