రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ భారీ లాభాలు ఆర్జించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో ఆ రంగ సూచీలపై మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. ఆ ప్రభావంతో దేశీయ సూచీలు కూడా స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. సోమవారం లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుప్లు అమ్మకాలకు మొగ్గుచూపుతుండడం కాస్త ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.33గా ఉంది (Indian stock market). గత సెషన్ ముగింపు (78,285)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కిందకు దిగి...