32 కేజీల బంగారం, 1518 కేజీల వెండి.. కానుకలన్నీ సురక్షితం
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ కీలక ప్రకటన చేసింది. తమ ట్రస్టు ఆధీనంలో సుమారు 30 కిలోల బంగారు ఐటమ్స్ ఉన్నట్లు తెలిపింది. సుమారు 1518 కేజీల వెండి వస్తువులు ఉన్నట్లు ఆ ట్రస్టు ట్రెజరర్ స్వామి గోవింద దేవ్ గిరి తెలిపారు. అయోధ్య రామాలయంలో విరాళాలను చోరీ చేసిన ఘటనలో 8 మంది అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతున్నది. అయితే భక్తులు సమర్పించిన విరాళాలను చోరీ చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ స్పందించింది. దేవాలయానికి ఇప్పటి వరకు 2926 విలువైన వస్తువులను కానుకలుగా సమర్పించారని, అవన్నీ...