అత్యున్న‌త పుర‌స్కారంతో ప్ర‌ధాని మోదీని స‌త్క‌రించిన ఇండోనేషియా

ప్ర‌ధాని మోదీ(PM Modi)కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇండోనేషియా ప్ర‌భుత్వం ఆయ‌న్ను అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్క‌రించింది. బిన్‌టాంగ్ ఆదిపూర్ణ(Bintang Adipurna) అవార్డుతో మోదీని స‌న్మానించారు. ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవో సుబియాంటో ఆ మెడ‌ల్‌ను అంద‌జేశారు. ప్ర‌స్తుతం మోదీ ఇండోనేషియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఎంతో ప్రేమ‌తో ఇండోనేషియాకు త‌న‌కు అత్యున్న‌త పుర‌స్కారాన్ని అంద‌జేసిన‌ట్లు పీఎంవో కార్యాల‌యం త‌న ట్వీట్‌లో తెలిపింది. ఈ గౌర‌వం కోట్లాది మంది భార‌తీయుల‌కు చెందుతుంద‌ని మోదీ పేర్కొన్నారు. ఈ సత్కారం ఇండోనేషియా ప్ర‌జ‌ల భావోద్వేగాల‌కు చెందుతుంద‌ని తెలిపారు. భార‌త్‌, ఇండోనేషియా మ‌ధ్య ఉన్న స‌న్నిహిత సంబంధాల‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవో సుబియాంటోకు త‌న హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన‌ట్లు...