సందీప్ రెడ్డి వంగా బ్యానర్‌లో ‘రోమాంచకం’
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ఒక సరికొత్త యూత్‌ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రోమాంచకం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల...