దాట్ల జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి మేరెడ్డి రజిత రెడ్డి – కేశవ్ రెడ్డి దంపతుల విశేష కృషి
దాట్ల జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి మేరెడ్డి రజిత రెడ్డి – కేశవ్ రెడ్డి దంపతుల విశేష కృషి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా దాట్ల జడ్పీ హైస్కూల్.. CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) ద్వారా పాఠశాల అభివృద్ధి కోసం 48లక్షలు కేటాయింపు మహబూబాబాద్ / దాట్ల, జూలై 7 (సుదీక్ష న్యూస్) : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలను తలపించేలా రూపుదిద్దుకోవడంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు మేరెడ్డి రజిత రెడ్డి – కేశవ్ రెడ్డి దంపతుల సేవలు విశేషంగా నిలిచాయి. గ్రామాభివృద్ధిపై ప్రత్యేక మమకారంతో ముందుకు వచ్చిన ఈ దంపతులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య,...