వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ముగ్గురు కార్మికుల మృతి..
కేరళం: భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందగా, మట్టి కింద కూరుకుపోయిన ఆరుగురిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరికొంతమంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై కేరళం ముఖ్యమంత్రి వి.డి.సతీసన్ స్పందించారు. వెంటనే జిల్లా మంత్రులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక, పునరావాస చర్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆదేశించారు. వయనాడ్‌కు వెళ్లి సహాయక, పునరావాస...