టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్

టీమిండియా ఓపెనర్, టీ20 ప్రపంచ కప్2026 విన్నింగ్ స్టార్ సంజూ శాంసన్ ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే పర్యటనకు దూరమైన సంజూకు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆసియా క్రీడల జట్టులోనూ అతడు స్థానం కోల్పోనున్నట్లు క్రీడా వర్గాలు అంటున్నాయి. గత నెలలో టీమిండియా సెలక్టెర్లు 15 మంది సభ్యులతో ఆసియా క్రీడల కోసం జట్టును ప్రకటించారు. ఆసియా క్రీడల కోసం ప్రకటించిన ఆ జట్టులో ఇషాన్ కిషన్‌తో పాటు మరో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆ జట్టు నుంచి కూడా సంజూను తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రీడావర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఐర్లాండ్ సిరీస్, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి...