టీఆర్ఎస్ పార్టీ పేరుపై కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట..
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నోటీసులకు ఇప్పటివరకు స్పందించని కవిత.. నేరుగా ఈరోజు(మంగళవారం) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం వారం రోజుల్లో కవిత తన అభిప్రాయాలను తెలిపిన తర్వాత...