దేశాన్ని, హిందూమతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారు..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, హిందూమతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం) రంపచోడవరం మండలం పందిరి మామిడిలో నీరా ప్లాంటేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో బీసీలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో 1,608 మంది బీసీలు పదవులు కోల్పోయారని తెలిపారు. వైసీపీ నేతలు...