యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గి, కణాల పనితీరు మెరుగుపడటంతో వృద్ధాప్య ప్రభావం నెమ్మదిస్తుంది. దీంతో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని యాంటీఆక్సిడెంట్ వ్యవస్థ బలపడుతుంది. దీంతో కణాలకు నష్టం కలిగించే ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే కొన్ని రసాయనాల స్థాయిలు తగ్గుతాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ కూడా తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మెదడు, జ్ఞాపకశక్తికి మేలు ఎక్కువకాలం యోగా చేసే...