కొలంబియా షూటౌట్‌..

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌(FIFA Worldcup)లో మంగ‌ళ‌వారం మరో మ్యాచ్ ఉత్కంఠంగా జ‌రిగింది. స్విట్జ‌ర్లాండ్ పెనాల్టీ షూటౌట్ ఆధారంగా కొలంబియాపై విజ‌యాన్ని న‌మోదు చేసింది. 4-3 గోల్స్ తేడాతో షూటౌట్‌లో స్విస్ నెగ్గింది. తొలుత ఇరు జ‌ట్ల మ‌ధ్య రౌండ్‌16 మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఎక్స్‌ట్రా టైంలో కూడా రెండు జ‌ట్లు గోల్స్ చేయ‌లేక‌పోయాయి. అయితే పెనాల్టీ షూటౌట్‌లో మాత్రం స్విస్‌కు క‌లిసి వ‌చ్చింది. కీల‌క‌మైన నిర్ణ‌యాత్మ‌క పెనాల్టీని రూబెన్ వ‌ర్గాస్ గోల్‌గా మ‌ల‌చ‌డంతో స్విట్జ‌ర్లాండ్ బృందంలో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. కొలంబియాపై 4-3 తేడాతో షూటౌట్‌లో నెగ్గిన స్విట్జ‌ర్లాండ్‌.. క్వార్ట‌ర్స్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనాతో త‌ల‌ప‌డ‌నున్న‌ది. మిస్సోరీలోని క‌న్సాస్ సిటీలో శ‌నివారం ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో...