తుంగభద్ర జలాల దోపిడీపై పోరుబాట.
ఏపీ, కర్ణాటక రాష్ట్రాల తుంగభద్ర జలాల దోపిడీపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కర్ణాకటలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ను పరిశీలించేందుకు బీఆర్ఎస్ బృందం బయల్దేరింది. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్ పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు.Politics ఇటీవల ఏపీ, కర్ణాటక తుంగభద్ర నదిపై అక్రమంగా సుమారు 65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల అక్రమ రిజర్వాయర్లు, బ్రిడ్జి కం బరాజ్‌లు నిర్మిస్తుండటంతో నడిగడ్డకు రావాల్సిన తుంగభద్ర జలాలు పూర్తిగా కనుమరుగయ్యే...