అల్లు అర్జున్ ‘రాకా’లో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె కథానాయికగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యాధునిక సాంకేతికత, భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా దర్శకుడు అట్లీ చేసిన ఓ ఆసక్తికర వ్యాఖ్య ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘రాకా’లో ఒక కీలక పాత్ర కోసం యువ నటి ప్రీతీ ముకుందన్ను సంప్రదించినప్పటికీ, ఆమె బిజీ...