ఇంకా అందని చేయూత...

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు చేయూత పథకం ద్వారా అందిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న కొత్తగా లక్ష పింఛన్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా కొత్తగా అర్హులైన వందలాది మంది పింఛన్ల కోసం అర్జీలు పెట్టుకొని ఎప్పుడెప్పుడు చేయూత అందుతుందనే ఆశతో ఎదురుచూశారు. జూన్‌ 2న ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నిరాశ చెందారు. దరఖాస్తు చేసుకున్న వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమాల్లో కూడా అనేక మంది చేయూత పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. 38 వేల మంది దరఖాస్తు జిల్లావ్యాప్తంగా దాదాపు...