అలాంటి వాళ్లపై దేశద్రోహం కేసులు ఎందుకు పెట్టకూడదు

రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని.. ఎస్సీలను పావులుగా వాడుకుని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈరోజు(బుధవారం) విజయవాడలో నిర్వహించిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చేందుకు ఎస్సీలను వాడుకుంటున్నారని ఆరోపించారు. విదేశీ శక్తులు కూడా కుట్రలో పాలు పంచుకుంటున్నాయన్నారు. విద్రోహ కార్యకలాపాలు చేసే వాళ్లు అందరూ ఇక్కడకు చేరుకుంటున్నారని తెలిపారు. హైకోర్టు తీర్పును ఉద్దేశించి పలువురు సభలు పెట్టి మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీలో పెద్ద నాటకం జరుగుతోందని మాధవ్ అన్నారు. ఎవరినైనా ఏది పడితే అది మాట్లాడొచ్చని అనుకుంటున్నారని.. హిందూ దేవతలను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడిన తర్వాత అరెస్టు చేస్తే...