ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం టైమ్ వేస్ట్ ప్రోగ్రామ్
ఇరాన్‌తో కుదుర్చుకున్న తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU) కథ ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతానికి చర్చలు కొనసాగించడానికి మాత్రం అనుమతిస్తానని ఆయన పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడిందన్న ఆరోపణలతో... ఇరాన్‌కు చెందిన రేవు పట్టణాలైన బందర్ అబ్బాస్, సిరిక్, అలాగే కెస్మ్ (Qeshm) ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా భారీ వైమానిక దాడులు జరిపిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు ఇరాన్ చమురు విక్రయాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మినహాయింపు లైసెన్స్‌ను కూడా వాషింగ్టన్ రద్దు చేసింది. దీనికి ప్రతిచర్యగా...