రైలులో హనీమూన్ సెటప్ వైరల్..
సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీ రైలు బోగీని హనీమూన్ సూట్‌లా అలంకరించి కొత్త జంటకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేశాయి. బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, “ఐ లవ్ యూ” బోర్డులతో అలంకరించిన రైలు క్యాబిన్‌ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటనపై తాజాగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 6న బల్లార్షా–ముంబై నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు జల్నా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో తీసిన వీడియో సోషల్...