ఢిల్లీలో భారీ జాబ్ స్కాం..

ఢిల్లీలో నిరుద్యోగులను విచిత్రమైన తీరులో కేటుగాళ్లు మోసం చేశారు. ఇన్‌కమ్ టాక్స్ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఈ ముఠా లక్షల్లో టోకరా వేసింది. ఈ భారీ జాబ్ స్కాం (Delhi Job Scam) రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన మాజీ ఉద్యోగి చిరాగ్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఐటీ ఆఫీస్ లోపలే నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించి కేటుగాళ్లు బాధితులను నమ్మించారు. ఏకంగా కార్యాలయం ప్రాంగణంలోనే నకిలీ ఇంటర్వ్యూలు, ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించడం గమనార్హం. ఢిల్లీ సివిక్ సెంటర్‌లోని ఇన్‌కమ్ టాక్స్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ఈ నకిలీ నియామకాల...