బూత్ లెవల్ అధికారులు సమర్థంగా పనిచేస్తేనే ‘సర్’ విజయవంతం..!

ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ విజయవంతం కావాలంటే బూత్ లెవల్ అధికారు లు (BLOలు) మరింత సమర్ధంగా పనిచేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నియమించిన బూత్ లెవల్ అధికారులకు సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన లేదని, అవసరమైన ఫారాలు కూడా అందుబాటులో లేవనే విషయాన్ని ఆయన సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీఆర్‌ఎస్ బృందం కీలక సూచలను చేసింది. ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో సాయంత్రం 4:.30 గంటలకు భేటీ సందర్భంగా ఎంపీ లు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు,...