మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని అలాగే చంపేస్తా..

రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్‌కుమార్‌ను బెదిరించినట్లు తెలిసింది. అయితే బాధితురాలు అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఆరుగురి ప్రాణాలు పోయేవి కాదని బాధితురాలి కుటుంబసభ్యులు అంటున్నారు. కేవలం పోలీసుల నిర్లక్ష్యమే ఇంతటి దారుణానికి కారణమైందని ఆందోళన చేపట్టారు. గతంలో భూతగాదాలో ఇద్దరిని బెదిరించినందుకు రాజ్‌కుమార్‌పై గతంలోనే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2018లో సరిత అనే మహిళను రాజ్‌కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు....