రైలు టికెట్ బుకింగ్ ఇక మరింత సులభం..
రైలు టికెట్ (Rail Ticket) బుక్ చేసుకునేప్పుడు అనవసర క్యాప్చాలు (Captchas) చిరాకు కలిగిస్తుంటాయి. తరచూ వచ్చే పాప్‌అప్‌లు (Pop ups) పిచ్చిలేపుతాయి. ఏ క్లాస్‌లో సీట్లు ఉన్నాయో తెలుసుకోవడానికి పదేపదే పేజీలు మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరలో తెర పడనుంది. వేగవంతమైన, సులభతరమైన టికెట్ బుకింగ్ (Ticket Booking) విధానం కోసం వెబ్‌సైట్ (Website) ను ఆధునికీకరిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలిపింది. ఈ మేరకు కొత్త బీటా వెర్షన్ (Beta Version) ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. మరికొన్ని నెలల్లో పూర్తిస్థాయి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొన్ని వారాల క్రితం రాజస్థాన్‌లోని మాలవీయ నేషనల్...