జుట్టు రాల‌డాన్ని స్వీక‌రిస్తూ గుండుతో ఉండేందుకే ప్రాధాన్య‌త ఇస్తున్న యువ‌త‌..

పురుషుల్లో జుట్టు రాలే స‌మ‌స్య చాలా కాలంగా ఆందోళనకు కారణమవుతోంది. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు మందులు, సప్లిమెంట్లు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లు, ఇతర చికిత్సలపై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇప్పుడు మరో కొత్త ధోరణి వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. జుట్టు రాలడాన్ని దాచిపెట్టడం లేదా దానితో పోరాడడం కంటే, పూర్తిగా గుండు చేయించుకుని ఆ రూపాన్ని ఆత్మవిశ్వాసంతో స్వీకరించే బాల్డ్‌మ్యాక్సింగ్ ట్రెండ్‌కు యువతలో ఆదరణ పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై గుండు రూపాన్ని స్వీకరించిన పురుషులు తమ అనుభవాలను పంచుకుంటూ ఒకరికొకరు ప్రోత్సాహం అందిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ కమ్యూనిటీల్లో హెయిర్‌లైన్ గురించి ఆందోళన పడకుండా సహజమైన రూపాన్ని అంగీకరించాలని ప్రోత్సహిస్తున్నారు. గుండు చేయించుకున్న తర్వాత...