బెల్జియంపై 2-1 తేడాతో విక్టరీ..
ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup) సెమీస్‌లోకి స్పెయిన్ ప్రవేశించింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై గెలుపొందింది. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మైకేల్ మెరినో ఆఖరి నిమిషాల్లో గోల్ కొట్టి.. స్పెయిన్ శిబిరంలో సంబరాలు నింపాడు. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మెరినో చివరి క్షణాల్లో గోల్ చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. బెల్జియం గోల్ కీపర్ గాయం వల్ల తప్పుకోవడంతో.. బ్యాకప్ కీపర్‌గా వచ్చిన లెమ్మెన్స్ బంతిని అందుకోవడంలో విఫలమ్యాడు. ఆ కీపర్‌ను తాకిన బంతి.. మళ్లీ ముందుకు వచ్చింది. ఆ సమయంలో మెరినో దాన్ని గోల్‌గా మలిచాడు. గోల్ పోస్టు రూఫ్ లోపల ఆ బంతి తగిలింది....