ఉదయం షుగర్ పెరగకుండా ఉండాలంటే..

మధుమేహం ఉన్న చాలా మంది ఉదయం నిద్రలేవగానే రక్తంలో చక్కెర (బ్లడ్ షుగర్) స్థాయిలు ఎక్కువగా ఉండటాన్ని గమనిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం తెల్లవారుజామున శరీరంలో విడుదలయ్యే కొన్ని హార్మోన్లు. వీటివల్ల కాలేయం ఎక్కువ గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. ఈ పరిస్థితిని వైద్యులు 'డాన్ ఫినామినన్' అని పిలుస్తారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా ఉదయం షుగర్ పెరగడాన్ని చాలావరకు నియంత్రించవచ్చు. ఉదయం నిద్రలేవగానే నీరు తాగండి రాత్రంతా శరీరానికి నీరు అందకపోవడంతో స్వల్ప డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ సాంద్రత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాసు నీరు తాగడం మంచి అలవాటు. రోజూ వ్యాయామం...