చ‌క్కెర తిన‌డాన్ని ఆపేస్తే.. క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకోవ‌చ్చా..

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే చక్కెర నేరుగా మెదడు క్యాన్సర్‌కు కారణమవుతుందా? క్యాన్సర్ కణాలకు ఆహారం అందకుండా ఉండేందుకు చక్కెరను పూర్తిగా మానేస్తే ట్యూమర్లు తగ్గుతాయా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఈ అంశంపై ఉన్న అపోహలను నిపుణులు నివృత్తి చేస్తున్నారు. చక్కెర నేరుగా మెదడు క్యాన్సర్‌కు కారణం కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్యూమర్‌ను ఆకలితో చంపాలంటే చక్కెరను పూర్తిగా మానేయాలని సోష‌ల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. ఇలాంటి తీవ్రమైన ఆహార నియమాలు కొన్నిసార్లు ఆరోగ్యానికి మేలు కంటే హాని...