లిఫ్ట్ మిల్లర్స్ బంద్‌కు పిలుపు జూలై 20న హనుమకొండ–వరంగల్‌లో బంద్ నిర్వహణ

హనుమకొండ, (సుదీక్ష న్యూస్): ఓరుగల్లు లిఫ్ట్ మిల్లర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ (సోమవారం) హనుమకొండ–వరంగల్ ప్రాంతాల్లో లిఫ్ట్ మిల్లర్స్ బంద్ నిర్వహించనున్నట్లు యూనియన్ ప్రకటించింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని యూనియన్ సభ్యులకు పిలుపునిచ్చింది. అన్ని లిఫ్ట్ మిల్లర్లు బంద్‌లో పాల్గొని సహకరించాలని కోరింది. బంద్‌కు సహకరించని వారిపై రూ.50,000 జరిమానా విధించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. బంద్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు మరియు తదుపరి కార్యాచరణను యూనియన్ ప్రతినిధులు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.