క్రికెట్ ఆడుతూ.. మోడల్ స్కూల్లో విద్యార్థి మృతి..!

లింగాపూర్ గ్రామ సమీపంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. క్రికెట్ ఆడుతుండగా బావిలో పడిన బంతిని తీసుకునే క్రమంలో సాత్విక్(13) అనే బాలుడు మరణించాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న సాత్విక్ మరణంతో అతడి తల్లిందడ్రులు అయ్యో దేవుడా ఎంత ఘోరం జరిగిందంటూ గుండెలుబాదుకుంటున్నారు. అంతర్గాం మండలం రామగుండం పోలీస్టేషన్ పరిధిలోని మోడల్ స్కూల్లో జరిగిన ఈ విషాదకరమైన ఘటనతో ఉపాధ్యాయులు, విద్యార్థులు షాక్‌లో ఉండిపోయారు. ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన సాత్విక్ లింగాపూర్ గ్రామ సమీపంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ ఆవరణలో తోటి విద్యార్థులతో కలిసి అతడు క్రికెట్ ఆడుతుండగా బంతి స్కూల్...