వర్షాకాలంలో స్టమక్ ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయి?
వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ ఈ కాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్, కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు కూడా గణనీయంగా పెరుగుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవి చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్ర సమస్యలను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం.. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం, మురుగునీరు తాగునీటిలో కలవడం, అపరిశుభ్ర వాతావరణం ఏర్పడటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు వేగంగా పెరుగుతాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఏ వంటి...