హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు
భాగ్యనగరంలోని పాతబస్తీ సైదాబాద్‌లో ఉన్న సక్సెస్ స్కూల్‌లో రెండోతరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి హోమ్‌వర్క్‌లో కల్మా, సూరహ్ ఫాతిహా చదివి రావాలని స్కూల్ డైరీలో రాశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్రంగా ఖండించారు. కొంతమంది హిందూ సంస్కృతిపై బలవంతంగా దాడి చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ధ్వజమెత్తారు. క్యూలర్ సంఘాలు ఎందుకు నోరు మెదపట్లేదు.. ఈరోజు (గురువారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. కల్మా సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. సోకాల్డ్ సెక్యూలర్ సంఘాలు ఎందుకు ఈ విషయంపై...