వివాదాస్ప‌ద బ్యాన‌ర్ ప్ర‌ద‌ర్శించిన అర్జెంటీనా ప్లేయ‌ర్లు..

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు వివాదాస్ప రీతిలో బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో గెలిచిన త‌ర్వాత అర్జెంటీనా ఆట‌గాళ్లు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. అయితే మైదానంలోనే ఆ ప్లేయ‌ర్లు ఓ బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. ఫాక్‌ల్యాండ్స్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే రీతిలో ఉన్న బ్యాన‌ర్‌ను ఆట‌గాళ్లు ప‌ట్టుకున్నారు. దీనిపై వివాదం చెల‌రేగింది. లాస్ మాల్వినాస్ స‌న్ అర్జెంటీనాస్ అని బ్యాన‌ర్‌లో రాసింది. అర్జెంటీనాకే ఫాక్‌ల్యాండ్స్ చెందుతాయ‌న్న అర్థం వ‌చ్చే రీతిలో బ్యాన‌ర్ ఉన్న‌ది. అట్లాంటిక్ స‌ముద్రంలో ఉన్న ఫాక్‌ల్యాండ్స్ దీవులు ఒక‌ప్పుడు బ్రిట‌న్ ఆధీనంలో ఉన్నాయి. అయితే ఆ దీవులు త‌మ‌కే చెందుతాయ‌ని అర్జెంటీనా పోరాడుతోంది. ఈ నేప‌థ్యంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు .. బ్యాన‌ర్లు...