స్నేహితుల సర్‌ప్రైజ్‌తో సమంత సీమంతం..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఓ సన్నిహిత కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుకకు వెళ్లిన ఈ జంటకు అక్కడ స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. సమంత గర్భిణిగా ఉండటంతో ఎలాంటి హడావిడి లేకుండా అక్కడే చిన్నపాటి సీమంతం వేడుక నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో సమంతకు కొత్త దుస్తులు అందించి, స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. ఈ సర్‌ప్రైజ్‌ను అస్సలు ఊహించని సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అయి స్నేహితుల ప్రేమాభిమానాలకు ఆనందం వ్యక్తం చేసినట్లు...