మహిళల కన్నా పురుషులకే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ..
పురుషుల ఆరోగ్యం గురించి సమాజంలో ఇప్పటికీ చాలామంది బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకాడుతున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, శరీరం ఇచ్చే సంకేతాలను గుర్తించడం, అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించడం ప్రాణాలను కాపాడగలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నప్పటి నుంచే బాలురకు బాధను బయటపెట్టకూడదని, బలంగా ఉండాలని నేర్పిస్తారు. పెద్దయ్యాక కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, ఎక్కువసేపు పని చేయడం వంటి కారణాలతో అలసట, ఛాతిలో అసౌకర్యం, ఒత్తిడి వంటి లక్షణాలను సాధారణ విషయాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ...